BCCI announce Schedule for Team India's home series against Australia, South Africa | ఈ ఏడాదంతా టీమిండియా తీరిక లేని షెడ్యూల్‌తో గడపనుంది. టీమిండియా జింబాబ్వే పర్యటన అనంతరం భారత్ జట్టు సొంతగడ్డపై మూడు సిరీస్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మూడు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా భారత్‌కు రానుండగా, ఆ తర్వాత సౌతాఫ్రికా సుదీర్ఘ కాలం పర్యటించనుంది. ఈ మూడు సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 20న ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ మొదలు కానుండగా,సెప్టెంబర్ 28 నుంచి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వా త భారత్ ప్రపంచకప్ బరిలోకి దిగనుంది.
#TeamIndiahomeseriesSchedule
#BCCI
#INDVSAUS
#INDVSSA
#AsiaCup2022