IND vs NZ : Rahane, Pujara ఖతం.. బ్యాకప్‌ Shreyas Iyer, Dravid ప్లానింగ్ || Oneindia Telugu

2021-11-26 747 Dailymotion

Download Convert to MP3

IND vs NZ 1st Test: Ajinkya Rahane, Cheteshwar Pujara trolled after failing in India vs New Zealand 1st Test
#INDvsNZ1stTest
#ShreyasIyer
#AjinkyaRahaneTrolls
#RahulDravid
#Pujara
#TeamIndia

టీమిండియా తాత్కలిక సారథి అజింక్యా రహానే మరోసారి నిరాశపరిచాడు. నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న రహానే.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లోనూ తన పేలవ ప్రదర్శనను కొనసాగించాడు. కీలక సమయంలో బాధ్యతాయుతంగా ఆడాల్సిన రహానే.. మరోసారి తన బలహీనతకే బలయ్యాడు. కేవలం 35 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. అయితే 6 ఫోర్లతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన రహానే.. కైల్ జెమీసన్ బౌలింగ్‌లో కట్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను వెంటాడి మరి మూల్యం చెల్లించుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో బరిలోకి దిగిన రహానే ఇంత నిర్లక్ష్యంగా ఔటవ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా రహానే ఇలానే ఔటైతే అతని కెరీర్ ముగిసినట్లేనని అభిప్రాయపడుతున్నారు.