Ap Assebly Election Results 2019 : చంద్రబాబు..వైఎస్ జ‌గ‌న్..ప‌వ‌న్: ఎవ‌రి ఇళ్ల‌ల్లో వాళ్లు!

2019-05-23 222 Dailymotion

Download Convert to MP3

Chief Minister of Andhra Pradesh Chandrababu Naidu, YSR Congress Party President YS Jagan Mohan Reddy and Jana Sena Party Chief Pawan Kalyan present in their home. The trio of leaders supervising the Counting from their homes in Capital City Region area in Amaravathi in Andhra Pradesh.
#ElectionResults2019
#modi
#amitshah
#nda
#congress
#rahulgandhi
#chandrababunaidu
#tdp
#ysjagan
#ycp
#telangana
#kcr
#janasena

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గన్మోహ‌న్ రెడ్డి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ త‌మ నివాసాల నుంచి ఓట్ల లెక్కింపును ప‌ర్య‌వేక్షిస్తున్నారు. గురువారం ఉద‌యం ఆరంభ‌మైన ఓట్ల లెక్కింపును దృష్టిలో ఉంచుకుని వారు త‌మ నివాసాల‌కు ప‌రిమితం అయ్యారు. దేశ రాజ‌ధానిలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఏకం చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైన ఉన్న చంద్ర‌బాబు నాయుడు.. మంగ‌ళ‌వారం రాత్రే గుంటూరు జిల్లాలో ఉండ‌వ‌ల్లి నివాసానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణుల‌తో భేటీ అయ్యారు. ఓట్ల స‌ర‌ళిని ప‌ర్య‌వేక్షించారు. ఈ ఉద‌యం కొంద‌రు పార్టీ కీల‌క నాయ‌కులు చంద్ర‌బాబు నివాసానికి చేరుకున్నారు. ఓట్ల లెక్కింపును ఉత్కంఠ‌త‌గా ప‌రిశీలిస్తున్నారు. మీడియా పాయింట్‌ వద్ద ఎల్‌ఈడీ తెరను ఏర్పాటు చేశారు. నాయకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేపట్టారు. రాజ‌ధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్నందున‌.. ప్ర‌స్తుతానికి పార్టీ వ్య‌వ‌హారాల‌న్నీ ఉండ‌వ‌ల్లి నుంచే కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.