Women's votes in the state will play a key role in the upcoming Lok Sabha elections. Women's vote bank is going to be the top 10 in 17 Lok Sabha seats in Telangana state. The male voter turnout in seven constituencies is likely to be the highest in the Lok Sabha elections. In the 10 constituencies, the women's vote bank will have an impact on the prospects.
#LokSabhaE lections2019
#WomenVotes
#constituencies
#Telanganastate
#andhrapradeshstate
రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మహిళల ఓట్లు కీలక భూమిక పోషించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ స్థానాలలో పది స్థానాలలో మహిళా ఓటు బ్యాంకు కీలకం కానుంది. ఇక ఏడు చోట్ల మాత్రమే పురుష ఓటర్ల ఆధిక్యం కనబడుతోంది. ఈ ఐదేళ్లలో 13.4 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మహిళలు ఎవరిని ఆదరిస్తే వారే విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 10 నియోజకవర్గాల్లో మహిళా ఓటు బ్యాంకు విజయావకాశాలపై ప్రభావం చూపించనుంది. దీంతో మహిళలు ఏ పార్టీని ఆదరిస్తే ఆ పార్టీ జెండా ఆ లోక్ సభ నియోజకవర్గాల్లో ఎగరనుంది. మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో చూసినట్లయితే మొత్తం ఓటర్లు 2,95,18,956 మంది ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు1,46, 74,973 మంది ఉన్నారు. ఇక పురుష ఓటర్ల విషయానికి వస్తే 1, 48,42,615 గా ఉంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ పరిధిలోని 17 లోక్సభ స్థానాలలో 2,81,73,254 మంది ఓటర్లుండగా ప్రస్తుతం 13,45,710 మంది ఓటు హక్కు నమోదు చేసుకోవడంతో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.