Telangana elections 2018: డిపాజిట్లు కూడా రావు అని తెరాస భయం: రోడ్ షో లో చంద్రబాబు| Oneindia Telugu

2018-12-05 1,211 Dailymotion

Download Convert to MP3

Chandrababu naidu participating in Telangana Assembly election campaign. Chandrababu naidu lashed out at TRS and Telangana's caretaker chief minister K Chandrasekhar Rao (KCR). Chandrababu said, TRS is scared of the people's mandate and so they are conducting bogus surveys to confuse them.
#TelanganaAssemblyelections
#Telanganaelections2018
#chandrababunaidu
#roadshows
#electioncampaign

చంద్రబాబు హైదరాబాదులో వరుసగా రోడ్డు షోలలో, సభల్లో పాల్గొంటూ కేసీఆర్ పైన నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు తెలంగాణ పాలనలో జోక్యం చేసుకునేందుకే ఇక్కడకు వస్తున్నారని, కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు చక్రం తిప్పుతారని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి చంద్రబాబు వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు బుధవారం సాయంత్రం 5 గంటలకు మూగబోనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారటంతో ప్రచారం నువ్వా? నేనా? అన్నట్లుగా సాగుతోంది. మంగళవారం కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌ నియోజక వర్గాల్లో ప్రజాకూటమి అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కేసీఆర్‌ కోసం ఇక్కడకు రాలేదని, ప్రజల కోసమే వచ్చానని తెలిపారు.