trs chief kcr public meeting schedule in constituencies.Telangana Caretaker Chief Minister K Chandrasekhara Rao on Wednesday filed his nomination papers from Gajwel Assembly constituency for the December 7 Assembly election in Telangana State. He is set to resume his election campaigns on Thursday with a huge public meeting in Gajwel.
#telanganaelections2018
#kcr
#trs
#Assemblyelection
#Gajwel
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయింది. ఈనెల 19,20 తేదీల్లో ఆరు సభల్లో పాల్గొంటారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. తొలి విడతగా ప్రగతి నివేదన సభతో పాటు ఒకటి రెండు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్.. మలివిడత ప్రచారానికి సిద్ధమయ్యారు. కేసీఆర్ పాల్గొనే నియోజకవర్గాల సభలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 19వ తేదీ : పాలేరు - ఖమ్మం నియోజకవర్గాల సభ 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ ప్రాంగణంలో జరగనుంది. అనంతరం 3 గంటల 30 నిమిషాలకు జనగామ జిల్లా పాలకుర్తిలో బహిరంగ సభ ఉంటుంది.