Telangana Elections 2018 : తెలంగాణపై బీజేపీ 'థర్డ్' ఆలోచన

2018-10-24 333 Dailymotion

Download Convert to MP3

The Bharatiya Janata Party in Telengana is hoping to emerge as the kingmaker in case the Telengana Rashtra Samiti (TRS) failed to cross the halfway mark in the state. The TRS will not align with any political party in the state for the formation of the government if it falls short of number except the BJP in the present scenario.
#bjp
#kcr
#trs
#telanganaelections2018


తెలంగాణలో బీజేపీ అంతగా బలం లేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలిచింది. అదీ హైదరాబాద్ పరిధిలోనే. అయితే ఈసారి కేసీఆర్ పైన వ్యతిరేకత, పరిపూర్ణానంద స్వామి చేరిక వంటి కారణాలతో ఎక్కువ సీట్లు గెలుస్తామని భావిస్తోంది. తెలంగాణలో ఇప్పటికి ఇప్పుడే అధికారంలోకి వస్తామని లేదా ప్రతిపక్షంలో కూర్చుంటామని బీజేపీ భావించడం లేదు. పైకి టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్నప్పటికీ.. ప్రధానంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి, టీఆర్ఎస్ మధ్యే పోటా పోటీ నెలకొనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణలో మూడో ఆలోచన చేస్తోంది. ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీకి కావాల్సిన సీట్లు రాకుంటే తాము టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చి చక్రం తిప్పవచ్చునని భావిస్తోంది.