Indian cricket captain Virat Kohli and Bollywood actress Anushka Sharma are tying the knot next week in Italy, the Adelaide Oval management invited the celebrated couple to get married.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ నటి అనుష్క శర్మల పెళ్లిపై అనుష్క మేనేజర్ స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ వీరిద్దరి వివాహంపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదని అయితే ఇటలీలో నిశ్చితార్థం చేసుకుంటున్నారని వార్త శుక్రవారం తెరపైకి వచ్చింది. నిజానికి రెండు రోజుల క్రితం వచ్చే వారంలో కోహ్లీ-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని... ఇటలీలో జరిగే ఈ పెళ్లికి కుటుంబ సభ్యలుతో పాటు అతి కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరవుతున్నారని వార్త వైరల్ అయింది. ఈ వార్తల్లో నిజం లేదని అనుష్క మేనేజర్ స్పందించిన సంగతి తెలిసిందే.
అయితే కోహ్లీ-అనుష్క శర్మల వివాహంపై అధికారిక ప్రకటన లేకపోయినా.... 'మీ పెళ్లి మా దగ్గర చేసుకోండి' అంటూ ఆస్ట్రేలియాకు చెందిన అడిలైడ్ ఓవల్ స్టేడియం నుంచి వీరికి ఆహ్వానం వచ్చింది. ప్రముఖ సెలబ్రిటీల పెళ్లి వేడుకను జరపడం తమ కోరికగా పేర్కొన్న అడిలైడ్ స్టేడియం నిర్వాహకులు కోహ్లీ-అనుష్క పెళ్లిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నట్లు పేర్కొంది. కాగా డిసెంబర్ 12న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ఇటలీలో పెళ్లి చేసుకోనున్నారన్న వార్తలు రాగా... అనుష్క ఫ్యామిలీ అందుకే ఇటలీకి వెళుతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు పెళ్లి కాదు.. నిశ్చితార్థం జరగనుందని అంటున్నారు. చూద్దాం... ఏం జరుగుతుందో!